Bibipeta : బీబీపేటలో ఘనంగా అయ్యప్ప పూజలు
Bibipeta : బీబీపేట మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఏడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. మామిడి తోరణాలు కట్టి సుందరంగా ఆలయాన్ని తీర్చి దిద్దారు. అయ్యప్ప భక్తులు పాల్గొని గణపతి హోమం, కలిశాభిషేకం, అష్టాభిషేకం ఉత్సవాలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. హోమం కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తి పాటలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్బంగా అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప...