Singareni : కాసిపేట గనిపై మహిళా దినోత్సవం
Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట గని ఆవరణలో శనివారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాసిపేట గని మహిళా కార్మికులను ఉన్నతాధికారులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ...... మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రక్షణ అధికారి నిఖిల్ మాట్లాడుతూ ఇంటిలో ఉండే మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. AITUC బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ...