CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 11:45 am Posted by : coalbelt 24 News

Holi : హోలీ రోజు ఈ పూజ చేయండి. దోషం తొలగిపోతుంది.

Holi : హోలీ పండుగ అంటేనే రంగుల ఆటగా భావిస్తారు చాలా మంది. కానీ ఆరోజు పూజలు చేసే వారు సైతం ఉంటారు. గుడికి వెళుతారు. డైవదర్శనం కోసం తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు కూడా వెళుతారు. కానీ హోలీ పండుగ పురస్కరించుకొని తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేస్తే వ్యక్తిగతంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది.

ఈ సంవత్సరం హోలీ పండుగ 2025 మార్చి 14న జరుపుకుంటారు. వేదంలో చెప్పబడిన ప్రకారం తులసి మొక్కకు కొన్ని పరిహారాలు చేయడం వలన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. లక్ష్మి దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వేదంలో చెప్పబడింది.
హోలీ పండుగ పురస్కరించుకొని ఎటువంటి పరిహారాలు చేయాలనే విషయాలు తెలుసుకుందాం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హోలీ పండుగ రోజు తులసి మొక్కకు పూజలు చేయండి. పూజ చేసిన అనంతరం తులసి మొగ్గలను తీసుకొని ఎర్రటి గుద్దలో కట్టి ఇంటి బీరువాలో భద్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఒక విశ్వాసం.

లక్ష్మీదేవి తులసిలో ఉంటుందని నమ్మకం. అందుకనే తులసి మొక్కను హిందువులు తమ ఇంట్లో పెంచుకుంటారు. ఎవరైనా తమ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలని కోరుకునే వారు పండుగ రోజు ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటండి. తులసి ఆచారం ప్రకారం పూజలు చేయండి. దింతో లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

హోలీ పండుగ రోజు తులసి మొక్కను పూలు, రంగులతో అలంకరించండి. తులసి గద్దెను శుభ్రం చేసే ముగ్గులు వేయండి. దీపం వెలిగించండి. నైవేద్యం పెట్టండి. ఈ విదంగా చేయడం వలన ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నులవు తుందని వేదంలో చెప్పబడింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});