CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 3:43 pm Posted by : coalbelt 24 News

vijayasanthi : ఢిల్లీ వెళ్లిన రాములమ్మ

vijayasanthi : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల గోల మొదలైనది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు ఆ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు సైతం గాంధీ భావం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొందరు మంత్రుల తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏమి జరిగినా ఢిల్లీలోనే జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ లోనే ప్రయత్నం చేద్దామంటూ నేరుగా ఢిల్లీకే వెళుతున్నారు. అటువంటి వారి జాబితాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి ఢిల్లీ వెళ్లారు.

ఇన్ని రోజుల నుంచి చాటుగా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా తెరపైకి రావడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు గుసగుస పెట్టు కుంటున్నారు. కానీ ఆమె ఢిల్లీ వెళ్లిన విషయం బయట పడటంతో ఎమ్మెల్సీ టికెట్ కోసమే వెళ్లిందని తేలిపోయింది. కేవలం ఎన్నికల సమయంలోనే రావడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఒకవేళ ఆమెకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా ఎదురవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చేతుల్లోనే ఉంటుంది. ఢిల్లీ లోనే అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ఆఎంపిక ప్రకారమే అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. అప్పటి వరకు రాములమ్మ కూడా వేచి ఉండక తప్పదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});