CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 9:28 am Posted by : coalbelt 24 News

good news : గుడ్ న్యూస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం… ఏప్రిల్ 1 నుంచి అమలు

good news : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ శుభవార్త తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్యాక్స్‌ ఫైలింగ్‌, మనీ ట్రాన్సాక్షన్‌లు, బిజినెస్‌ ఆపరేషన్లను సులభతరం చేసింది.

ఆదాయపు పన్ను విభాగంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సరికొత్త నిబంధనలను తీసుకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన విధానం అమలు కావడంతో చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్‌ వలన ఉద్యోగులు, వ్యాపారాలు, విద్యార్థులకు అనేక విధాలుగా మేలు జరుగనున్నది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ట్యాక్స్‌ ఫైలింగ్‌, మనీ ట్రాన్సాక్షన్‌లు, బిజినెస్‌ ఆపరేషన్ల కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేసింది. అనవసరమైన ట్యాక్స్‌ డిడక్షన్‌లను తొలగించింది. ప్రధానంగా TDS, TCS చెల్లింపులను సులభతరం చేసేందుకు పన్ను నియమాల్లో పలు కీలక మార్పులను ప్రకటించింది.

కొత్తగా సవరించిన మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనవసరమైన కాంప్లెక్సిటీలు లేకుండా సాధారణ పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు సులువుగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి అవకాశం కలిగింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});