మీనాక్షి తలపై ముళ్ల కిరీటమే

Minaksi : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ ముందర ఎన్నో సవాళ్లు నిలిచి ఉన్నాయి. పార్టీ గీత దాటితే వేటు తప్పదంటున్న ఆమె ముందు, ముందు ఎలాంటి చర్యలు తీసు కుంటారో అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తలపై ముళ్ల కిరీటం ఉంది. ఆమె భాద్యతలు స్వీకరించడానికి హైదరాబాద్ చేరుకున్న పరిస్థితులు చూస్తుంటే ఆడంబరాలకు దూరం అంటూ కాంగ్రెస్ శ్రేణులకు సంకేతాలు పంపింది. పార్టీ పనితీరే ప్రధానమంటూ స్పష్టం...