CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 10:21 am Posted by : coalbelt 24 News

Actor : నిర్మాతలు ఆ నటి గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి ?

Actor : తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు సినిమాల్లో నటిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతారు. తమ అభిమాన తార సినిమా కోసం ఎదురు చూస్తుంటారు అభిమానులు. కొందరు పోటీ తట్టుకోలేక వెనుదిరిగి పోయిన ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. కానీ ప్రతిభ ఉంది, పోటీని తట్టుకునే సామర్ధ్యం ఉన్న ఆ అందాల భామకు ఏమైనదో ఏమో కానీ మూడేళ్ళుగా తెలుగు పరిశ్రమలో కనబడుటలేదు.

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డే నే దక్కించుకుంది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, తదితర స్టార్ నటులందరితో నటించి మెప్పించింది. అంత టాలెంట్ ఉండి కూడా పరిశ్రమలో మూడేళ్ళ నుంచి కనబడకపోయేసరికి వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇటీవలనే కొందరు నిర్మాతలు ఆ నటి గురించి ఇలా మాట్లాడారు. ఆమె ఎవరంటే ప్రముఖ నటి పూజ హెగ్డే. ఆమె షూటింగ్ కు వస్తే ఆమె కోరికలు చాలా ఖరీదుతో ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. అధిక పారితోషకం కూడా అడగటంతో నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదని తెలిసింది. ప్రత్యేక మేకప్ మాన్, వ్యానిటి వ్యాన్, జిమ్, టచ్ అప్, విలాసవంతంగా ఉండే స్టార్ హోటల్ కావాలంటున్నారని కొందరు నిర్మాతలు ఇటీవల తమ మనసులోని మాటను బయట పెట్టారు. అందుకనే పూజ హెగ్డేకు తెలుగులో అవకాశాలు రావడం లేదని తెలుగు పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});