CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 01 March 2025, 11:35 am Posted by : coalbelt 24 News

Moksazna : మోక్షజ్ణ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?

Moksazna : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా తీరిక లేకుండా ఉన్నారు. భవిష్యత్తులో బాలకృష్ణ పూర్తి కాలం రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన వారసుణ్ణి చిత్ర పరిశ్రమకు, అభిమానులకు పరిచయం చేయబోతున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ణ ను వెండితెరకు పరిచయం చేయడానికి బాలకృష్ణ సిద్ధమయ్యాడు.

మోక్షజ్ణ తో సినిమా తీయడానికి చిత్ర బృందం సిద్దమైనది. కథ కూడా తయారైనది. షూటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. నటీ, నటుల బృందాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ గురించి కూడా ఎక్కడ మాట్లాడటం లేదు. తమ అభిమాన నటుడి వారసుడి సినిమా కోసం అభిమానులు ఎదురుచూడక తప్పలేదు. షూటింగ్ నిలిచి పోడానికి కారణాలు మాత్రం తెలియడంలేదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అభిమానులు సైతం మోక్షజ్ణ సినిమా ఆగిపోయినట్టుగానే భావించారు. ఇంతలో హీరో బాలకృష్ణ మాత్రం ఒక సందర్భంలో ఒక ప్రకటన మాత్రం విడుదల చేసాడు. మోక్షజ్ణ అనారోగ్య కారణాల వల్లనే సినిమా షూటింగ్ నిలిచిపోయిందని. కోలుకున్నాక షూటింగ్ మొదలవుతుందన్నారు. షూటింగ్ మొదలుపెట్టే తేదీని కూడా అభిమానులకు తెలియపరుస్తామన్నారు. దింతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});