CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 7:08 am Posted by : coalbelt 24 News

tamata : ఒక్క గ్లాస్ టమాటా జ్యుస్…ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

tamata : టమాటా తో కూర వండుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. టమాటా చారు చేసుకుంటారు. అంతేకాదు రసం కూడా చేస్తారు. దాదాపుగా చాలా మంది కూరగాయల్లో కూడా టమాటా వేసి వండుతారు. కానీ టమాటా జ్యుస్ తాగితే శరీరానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

టమాటా జ్యుస్ ను కాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థ, చర్మం, గుండె ఆరోగ్యంపై మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ తీసుకోవడం వలన దేహం శక్తివంతంగా తయారవుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. కడుపునకు తేలికగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. డయాబెటిక్ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో టమోటా జ్యుస్ తాగడం వలన అదుపులోకి వస్తుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

టమాటా జ్యుస్ లో లైకోపీన్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులు దూరమవుతాయి. జలుబు, దగ్గు వంటి చిన్న, చిన్న వ్యాధులు దూరమవుతాయి. వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});