Bibipeta : బీబీపేట లో ఘనంగా శివరాత్రి వేడుకలు

Bibipeta : కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని శివాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ నగరేశ్వర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, మండల వాసులు ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. మామిడి తోరణాలు కట్టి సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే దర్శనం చేసుకోవడంతో ఆలయం కిటకిటలాడింది. వేద పండితులు భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంపిణి చేశారు. శివ,పార్వతులను దర్శనం చేసుకొని భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం...