CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 12:28 pm Posted by : coalbelt 24 News

Fasting : వారానికి రెండుసార్లు ఉపవాసముంటే ఎన్ని లాభాలో తెలుసా ?

Fasting : నచ్చిన దేవునిపేరిట కొందరు ఉపవాసం ఉంటారు. మరికొందరు ఇంటి ఇలవేలుపు పేరుతొ ఉపవాసం ఉంటారు. ఇలా దేవుళ్ళ పేరిట వారంలో ఒక రోజు నుంచి మూడు, నాలుగు రోజుల వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసం పేరిట కొందరు ఉదయం అల్ఫాహారం తింటారు. దాంతో పాటు చాయ్, పాలు, కాఫీ కూడా తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి అల్ఫాహారం తింటారు. మరికొందరు ఒకే ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం ముగిస్తారు.

వారంలో రెండు సార్లు ఉపవాసం ఉంటె శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం ఉండే రోజు కేవలం ఒకే ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. మిగతా రెండు పూటలు ద్రవ, ఘన పదార్థాలు తీసుకోరాదు. ఇలా వారంలో రెండు సార్లు భోజనంతో సరిపెట్టుకుంటే శరీరానికి బోలెడన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వారంలో రెండుసార్లు ఉపవాసం ఉంటె జీర్ణ సమస్య ఉంటె తొలగిపోతుంది. మలబద్దకం సమస్య కూడా ఉండదు. ఆకలి మితంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి అవకాశం. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండ వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటె ఈ విధమైన మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});