CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 11:47 am Posted by : coalbelt 24 News

Actor :ప్లాటుఫారంపై నిద్రించి పార్లమెంట్ కు ఎన్నికయిన ఆ నటి ఎవరో తెలుసా ?

Actor : చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఆశామాషి వ్యవహారం కాదు. సీనియర్లను ఎదుర్కోవాలి. నటించిన సినిమాలు విజయవంతం కావలి. అప్పుడే తిరుగులేకుండా పరిశ్రమలో ఎదుగుతారు. కొందరు చిత్ర పరిశ్రమకే జీవితాంతం అంకితం అవుతారు. మరికొందరు మధ్యంతరంగా బయటకు వచ్చేసి వ్యాపారంలో అడుగుపెడతారు. ఇంకొందరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. కానీ వీరందరికంటే బిన్నంగా ఒక అందాల సినిమా ముద్దు గుమ్మ ఏకంగా పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె నిజజీవితం మాత్రం కష్టాలతో కూడుకున్నది. ఎలా అంటే ………

సినిమాల్లో నటిస్తాను అంటే ఆమె తల్లి దండ్రులు ఒప్పుకోలేదు. సినిమా రంగం పై ఉన్న శ్రద్ద తో ఆమె పట్టుదలదో ఉంది. చివరకు ఎవరికీ చెప్పకుండానే తన పదిహేన్నేళ్ళకే ఇంటినుంచి వచ్చేసింది. తోడు, నీడ లేదు. చివరకు రైల్వే ఫ్లాట్ ఫారం ఆమెకు తోడు, నీడ అయ్యింది. ఆ ఫ్లాట్ ఫారం మీదనే నిద్రలేని రాత్రులు గడిపింది. ఎట్టకేలకు హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తిరుగులేని నటిగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అక్కడితో ఆగిపోలేదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఉన్నప్పటికీ వదులుకొంది. రాజకీయ ప్రవేశం చేసింది. బీజేపీ లో చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము నుండి పోటీచేయడానికి అవకాశం దక్కింది. ఎట్టకేలకు పార్లమెంట్ సభ్యురాలిగా ఘనవిజయం సాధించింది. ఆమె ఎవరో కాదు. కంగనా రౌత్. సినిమా కెమెరా ముందు పంచ్ లు విసిరిన ఆమె ఇప్పడు పార్లమెంట్లో తన పంచ్ లు విసురుతూ సీనియర్ నాయకులను ఆకట్టుకోవడం విశేషం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});