CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 8:25 am Posted by : coalbelt 24 News

Fruits : ఆ 6 పండ్లు తింటే మహిళలకు డాక్టర్ అవసరమే లేదు

Fruits : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. మితిమీరిన ఆహారంతో అనారోగ్యమే. సమయానికి ఆహారం తీసుకోకపోయినా అనారోగ్యమే. శరీరానికి సరిపడని ఆహార పదార్థాలు తింటే కూడా అనారోగ్యమే ఎదురవుతుంది. ముక్యంగా మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కూడా అదనంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆరు రకముల పండ్లు నిత్యం తింటే వారికి డాక్టర్ అవసరమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెర్రీ పండ్లు…. ఈ పండ్లను వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండ తీసుకోవాలి. లేదంటే చక్కెర లేకుండా చెర్రీ పళ్లతో జ్యుస్ చేసుకొని తాగాలి. ఇలా తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. నరాలు పనితీరు మెరుగవుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

యాపిల్….ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం కొవ్వును తగ్గిస్తుంది. ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది.

టమాట….. దీన్ని పండు గా చాలా మంది గుర్తించరు. ఈ పండు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. నిత్యం రోజుకో టమాటా పండు తినడం వలన చర్మంపై ఆరోగ్యాంగా ఉంటుంది.

ఆవకాడో…… దీనిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన గుండె పనితీరు మెరుగవుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనంతో కలిపి తినడం వలన ఆకలి అదుపులో ఉంటుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.

జామ….. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వారంలో రెండుసార్లు తినాలి. జామ పండు తినడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. నెలసరి సమస్య ఉంటె నివారిస్తుంది.

బొప్పాయి….. బొప్పాయి పండులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. రక్తం తక్కువగా ఉన్నవారికి మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});