CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 2:29 pm Posted by : coalbelt 24 News

sivaratri : శివరాత్రి పర్వదినం ఈరోజు వస్తుంది ? సమయం ఎప్పుడు ?

sivaratri : శివరాత్రి పర్వదినం గొప్ప పండుగ. ఆరోజు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. నదుల్లో పుణ్య స్నానం చేస్తారు. ఉపవాస దీక్షతో రాత్రంతా మెలకువతో ఉండి భక్తి గీతాలు ఆలపిస్తారు. శివుడికి ఇష్టమైన నైవేద్యం అర్పిస్తారు. పూలు, పండ్లు శివుడికి అర్పిస్తారు. పాలతో అభిషేకం చేస్తారు. శివాలయాల్లో శివనామస్మరణ చేస్తూ పూజలు చేస్తారు.

కానీ అసలు శివరాత్రి పండుగ ఏ రోజు వస్తుంది. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ముహూర్తం ఉంటుంది అనే విషయం చాలా మంది భక్తుల్లో సందిగ్ధంగా ఉంది……..శివరాత్రి పండుగ ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఇదే నెలలో 26 తేదీన భక్తులు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. కానీ ముహూర్తం గురించి వేద పండితులు ఈ విదంగా చెబుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శివరాత్రి పండుగను బుధవారం, ఫిబ్రవరి 26 న జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం 2025 లో మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి న వస్తుంది. ఈ నెల 26న బుధవారం ఉదయం 11:08 గంటలకు పండుగ ప్రారంభ మవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం అంటే 27వ తేదీన ఉదయం 8:54 గంటలతో పండుగ ముహూర్తం ముగుస్తుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});