shivaji : బీబీపేటలో ఘనంగా శివాజీ జయంతి
shivaji : బీబీపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా శివాజీ విగ్రహానికి ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పూలమాల వేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. వీర శివాజీ ... జై శివాజీ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. పలువురు శివాజీ అభిమానాన్ని చాటుతూ పాడిన పాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం మిఠాయిలు పంచుకొని జయంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణ...