CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 7:23 am Posted by : coalbelt 24 News

Politics : ఆ ఇద్దరి నాయకుల రహస్య మంతనాలతో ఏపీ లో పెద్ద టాక్

Politics : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎదో ఒక దుమారం వస్తూనే ఉంటుంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా అంతుపట్టదు. కండువా కప్పుకుని వరకు అంత కూడా రహస్యంగానే ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండానే జరిగిపోతుంది. పార్టీకి రాజీనామా చేసే విషయం కూడా విలేకరుల సమావేశంలో చెప్పే వరకు తెలియదు. ఒక పార్టీ నాయకుడు, మరొక పార్టీ నాయకుడు కూడా జరిపే మంతనాలు కూడా తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు ఓ ఇద్దరు నాయకులు జరిపిన రహస్య మంతనాలు ఏపీ లో గుప్పుమన్నాయి.

గతంలో ఆ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె బగ్గుమనేది. ఒకరంటే, ఒకరికి గిట్టేది కాదు. ఎడమొహం, పెడమొహం ఇద్దరి మధ్య ఉండేది. అటువంటిది ఇప్పుడు ఆ ఇద్దరు మంతనాలు జరిపారు. ఆ ఇద్దరు రహస్యంగా సమావేశమయ్యారు అంటే రాజకీయ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. వారి భేటీ గురించి అరా తీస్తున్నారు. ఎవరి కోసం రహస్యంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏఏ విషయాలు చర్చించారు. ఆ ఇద్దరి భేటీ గురించి తెలుసుకోడానికి రాజకీయ నాయకులు కొందరు ఫోన్ ను వదిలిపెట్టడం లేదు. ఆ ఇద్దరు ఎవరంటే….




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఒకరు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల. మరొకరు ఇటీవలనే తన పదవికి రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డి. రెండు రోజుల కిందటనే వీరిద్దరూ రహస్యంగా భేటీ కావడంతో ఏపీ లో ఈ విషయం ఒక్కసారిగా గుప్పుమంది. ఈ విషయం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం కావడం విశేషం. రహస్య భేటీ వివరాలను ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వెల్లడిస్తే కానీ వారి అనుచరులకు తెలుస్తుంది. అంత వరకు ఇది పెద్ద సస్పెన్స్.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});