Singareni : సింగరేణిలో విజిలెన్స్ వేధింపులు

Singareni : సింగరేణి బొగ్గుగని కార్మికులపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన కొందరి వేధింపులు రోజు, రోజుకు మితిమీరి పోతున్నాయని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (IFTU) రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ విజిలెన్స్ లోని పలువురు అధికారులు, సిబ్బంది అవలంబిస్తున్న విధానాల వలన కార్మికులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. అకారణంగా కార్మికులకు నోటీసులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. చేయని తప్పుకు కూడా వారి వలన శిక్ష...