Singareni : క్రిటికల్ మినరల్స్ మైనింగ్ రంగంలోకి సింగరేణి

Singareni : బొగ్గు మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్ సంస్థతో ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్.మూర్తి నేతృత్వంలో ప్రొఫెసర్ల బృందం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ నేతృత్వంలో డైరెక్టర్లు, సీనియర్ మైనింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం జరిగింది. క్రిటికల్...