CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 5:58 am Posted by : coalbelt 24 News

Ex CM : మాజీ సీఎం కేసీఆర్ ఇంటిలో విషాదం

Ex CM : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలత చెందారు. సమాచారం తెలియగానే కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్లారు.

మాజీ సీఎం కేసీఆర్ కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న తోబుట్టువులు. వీరిలో కొందరు కాలం చేశారు. ప్రస్తుతం ఉన్నవారిలో ఐదో సోదరి అయినటువంటి చీటీ సకలమ్మ (85) గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వయోభారంతో పాటు పలు అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విషయం తెలియగానే కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. చీటీ సకలమ్మ ఓల్డ్ అల్వాల్ సాయిబాబా నగర్లోని టిఎస్సార్ గోల్డెన్ లీఫ్ అపార్ట్మెంట్ లో ఆమె నివాసం ఉంటున్నారు. 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});