CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 11:11 am Posted by : coalbelt 24 News

Renudeshay : ఆ విషయంలో రేణు దేశాయ్ బాధపడుతోంది.ఎందుకో తెలుసా ?

Renudeshay : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నటి రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. తన అభిమానులకు మీడియా ద్వారా సలహాలు, సూచనలు కూడా అందిస్తుంది. అంతేకాదు అభిమానులు సలహాలను కూడా స్వీకరిస్తుంది. నిత్యం రేణు దేశాయ్ తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఆమె ఒక విషయంలో చాలా భాదపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ విషయం ఏమిటంటే….

వాస్తవానికి రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు. ఈ విషయం చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులకు కూడా తెలిసిందే. ఇటీవల ఆమె ఫెలిసెట్ అనే పిల్లి గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇటీవల అంతరిక్షములోకి ఫెలిసెట్ అనే పిల్లిని పంపారు. ఆ పిల్లిని పంపడానికి ముందు దాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. చాలా రోజుల పాటు ఆ పిల్లిని బాధలకు గురిచేసి పంపడానికి సిద్ధం చేశారు. కదలకుండా కూర్చోబెట్టి ఒక గట్టి కంటెయినర్ లో ఉంచారు. అంతే కాకుండా ఆ పిల్లి శరీరంలోకి ఎలక్ట్రోడ్ లను కూడా పంపారు. ఇప్పుడు ఆ పిల్లి అంతరిక్షములో రెండు నెలల పాటు ఉండాలి. అక్కడే ఆ పిల్లితో ప్రయోగాలు చేయనున్నారు. ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తూ పిల్లిని చిత్రహింసలకు గురిచేయడాన్ని ఆమె తట్టుకోలేనట్టుగా తన ఆవేదనను తన సోషల్ మీడియా ద్వారా భాదపడుతూ వెల్లడించింది

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});