CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 January 2025, 1:14 pm Posted by : coalbelt 24 News

Singareni : సమరశీల ప్రతిఘటన పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

Singareni : కార్మిక చట్టాల పరిరక్షణకు కార్మిక వర్గం సమరశీల ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ పిలుపు ఇచ్చారు. కొత్తగూడెం క్లబ్ లో IFTU రాష్ట్ర అధ్యక్షులు జి అనురాధ ఐ కృష్ణల అధ్యక్షతన విలీన సభ జరిగింది. ఐక్యత సభ ప్రారంభానికి ముందు కొత్తగూడెం పట్టణంలో వందల సంఖ్యలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్ లో ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సాదినేని సంస్థ జెండాను ఎగరవేశారు. డి ఎఫ్ టు యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్ధన్ ప్రవేశపెట్టిన అమరవీరుల సంతాప తీర్మానంతో సభ ప్రారంభమైంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్బంగా అపర్ణ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ దేశంలో పెరుగుతున్న పాసిజం ప్రమాదం నేపథ్యంలో పార్లమెంటరీ రాజ్యాంగబద్ధ సంస్థల విధ్వంసం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలకు దేశ సమస్త వనరులను, శ్రామికుల శ్రమశక్తిని కారు చౌకగా దోసి పెట్టడానికి మన దేశ పాలకవర్గం విధానాలను రూపొందించి అమలు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేశ సంపద సృష్టికర్తలు ఉత్పాదక శక్తులైన కార్మికులు, రైతుల పై దళారి పాలకవర్గం దాడిని తీవ్రతరం చేసిందని అపర్ణ ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కీలకమైన కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ ను ముందుకు తేవడం జారిందన్నారు. తద్వారా దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వలన కంపెనీ వ్యవసాయంగా మార్చాలని మూడు వ్యవసాయ సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందని ఆమె ఆరోపించారు.

అనంతరం సభలో అంతర్జాతీయ పరిస్థితులు- కార్మిక వర్గం పై ప్రభావం అంశంపై ఐ ఎఫ్ టి యు జాతీయ ఉపాధ్యక్షులు బి ప్రదీప్, నేటి దేశ పరిస్థితులు- కార్మిక వర్గం అంశంపై ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు, ఫాసిజం- కార్మిక వర్గం పై ప్రభావం అంశంపై ఐ ఎఫ్ టి యు జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్, కార్మిక వర్గం స్థితిగతులు- ఐఎఫ్టియు కర్తవ్యాలు అంశంపై జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ లు ప్రసంగించారు. రెండు సంస్థల ఐక్యత తీర్మానాన్ని ఐఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రవేశపెట్టగా సభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం పలు తీర్మానాలను సభ ఆమోదించడం జరిగింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});