CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 4:05 am Posted by : coalbelt 24 News

Rajanikanth : అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసిన రజనీకాంత్

Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నటన గురించి చెప్పాల్సిన అవసరంలేదు. తన అభిమానులకు ఎప్పుడు పండుగ వాతావరణాన్ని అందిస్తాడు. రజనీకాంత్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అభిమానుల అభిరుచికి తగిన విదంగా రజనీకాంత్ కథను ఎంపిక చేసుకుంటాడు. ఇటీవల వచ్చిన జైలర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లను చేసిపెట్టింది. జైలర్ సినిమా రజనీకాంత్ ఊహించిన దానికంటే భారీ విజయాన్ని అందించింది. తాజాగా అదే సినిమాకు సీక్వెల్ గా ” జైలర్-2 ” నిర్మిస్తున్నారు.

జైలర్ 1లో రజనీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ, వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగి బాబు నటించారు. జైలర్-2 లో కూడా ఇదే బృందం నటిస్తోంది. సంక్రాంతి కానుకగా తన అభిమానుల కోసం జైలర్-2 టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సంక్రాంతి కానుకగా విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ సంగీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల నుంచి కూడా స్పందన వస్తోందని చిత్ర బృందం టాక్. భారీ అంచనాలతో నిర్మిస్తున్న జైలర్-2 సినిమా జైలర్ -1 కంటే ఎక్కువ వసూళ్లు తో పాటు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});