Minister : జాతరలో తెలంగాణ మంత్రి మోకాళ్లపై నిరసన
Minister : సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక క్యాబినెట్ హోదా మంత్రి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులు ఎంత నచ్చచెప్పినా ఆ మంత్రి అదే పద్దతిలో నిరసన కొనసాగించడం విశేషం. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఉమ్మడి కరీం నగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి జాతర ప్రతి ఏటా జరుగుతుంది. ఈ జాతరకు సంబందించిన ఏర్పాట్లపై ముందస్తుగానే మంత్రి...