Inavolu : పూనకాలతో దద్దరిల్లుతోన్న ఐనవోలు మల్లన్న క్షేత్రం
Inavolu : నుదుటికి బండారి బొట్టు.....పసుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పట్నాలు...చేతిలో ఈరగోలలు.... శివసత్తుల పూనకాలతో తెలంగాణ పల్లెలన్నీ బయలు దేరి ఐనవోలు మల్లన్న జాతరకు చేరుకున్నాయి. ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రం. గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మ సమేతంగా మల్లికార్జునుడు కొలువుదీరిన క్షేత్రంలో గజ్జెల్లాగుల సవ్వడి.. డమరుక నాధాల ప్రతిద్వవి…ఒగ్గుడోలు వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం దద్దరిల్లిపోతుంది. ఐనవోలు క్షేత్రంలో సంక్రాంతి పండుగతో మొదలై ఉగాది పండుగతో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మహా...