CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 January 2025, 1:50 pm Posted by : coalbelt 24 News

Singareni : సంఘంలో స్వార్థం ఉండరాదు

Singareni : సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య ముఖ్య అథితి గా హాజరైనారు. ఈ సందర్బంగ సంఘం నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లాడుతూ సంఘం ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరంలో ఎప్పుడు కూడా ముందుండాలన్నారు. సంఘం పుట్టిందే సమస్యల పరిస్కారం కోసం, కానీ స్వార్ధం కోసం కాదన్నారు. సమస్యలు పరిష్కరించడం, అందుబాటులో ఉంటేనే సంఘం అభివృద్ధి చెందుతుందన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు, సెంట్రల్ ట్రెజరర్ జిమిడి మల్లేష్, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్, బ్రాంచ్ సెక్రెటరీ నక్క సుమన్ వివిధ ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});