CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 10:31 am Posted by : coalbelt 24 News

TTD : ఆ వార్తలపై టీటీడీ అసంతృప్తి

TTD : ఏడు కొండలపై వెలసిన తిరుమల, తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పిఆర్ఓ గ పనిచేసిన నిస్కా బేగం ఇంటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ తనిఖీలు చేస్తోందనే వార్త ఒక్క సరిగా సోషల్ మీడియా లో గుప్పుమంది.

ఆమె ఇంటిలో పెద్ద ఎత్తున బంగారం, నగలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో లను కూడా జతపరచి షేర్ చేస్తున్నారు. ఈ విదంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తలపై టీటీడీ స్పందించింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు తప్పు అని ప్రకటించింది. గత ప్రభుత్వం హయాంలో కానీ, దేవస్థానం పరిధిలో కానీ నిస్కా బేగం అనే వ్యక్తి పనిచేయలేదని స్పష్టం చేసింది. అటువంటి వ్యక్తులతో ఎలాంటి సంభందం కూడా లేదని టీటీడీ బోర్డు ప్రకటించింది. దేవస్థానంపై తప్పుడు వార్తలతో ప్రచారం చేసే వారిపై టీటీడీ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});