CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 2:04 pm Posted by : coalbelt 24 News

Banana : ఆరోగ్యానికి అరటి పువ్వు ఎంత మంచిదో తెలుసా ?

Banana : అరటి కాయ ను కూర వండుకుంటాం. చిప్స్ తయారు చేసుకుంటాం. అరటికాయతో పచ్చడి చేస్తాం. కానీ చాలా మంది అరటి పువ్వును నిర్లక్ష్యం చేస్తారు. పువ్వు గురించి పట్టించుకోరు. కానీ పువ్వును సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అరటి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. శరీర బరువు తగ్గిస్తుంది. చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఈ పువ్వులో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో ఇబ్బంది పడేవారు పువ్వును కూర చేసుకొని తింటే ప్రయోజనం ఉంటుంది. దీనిలో ఉండే జింక్ ఎముకలను బలంగా తయారు చేస్తుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అధిక రక్తపోటు ఉన్నవారికి మేలు చేస్తుంది. అనేక వ్యాధులకు ఔషదంగా పనిచేస్తుంది. గ్లూకోజ్ శాతం నెమ్మదిగా పెరుగుతుంది. చెక్కర స్థాయిని కూడా తగ్గిస్తుంది. కిడ్నీలల్లో రాళ్లను నివారిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్‌ కిడ్నీలను ఆరోగ్యముగా ఉంచుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});