CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 3:24 pm Posted by : coalbelt 24 News

Ekadashi : ముక్కోటి ఏకాదశిన ఎలా ఉండాలి

Ekadashi : ముక్కోటి ఏకాదశి రోజు హిందువులకు చాలా పవిత్రమైనది. ఆ రోజున శ్రీ మహా విష్ణువును భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. ఉపవాస దీక్ష చేసి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. శ్రీ మహా విష్ణువును ఉపవాసంతో పూజించడం వలన మోక్షము లభిస్తుందని, మరణానంతరం మరు జన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠ ధామంలో స్థానం పొందుతారనే నమ్మకం భక్తుల్లో ఉంది.

వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటల నుంచే వైష్ణవ దేవాలయాల్లో పూజలు మొదలవుతాయి. భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. ఆరోజు ఎవరితో గొడవ పెట్టుకోరాదు. కుటుంబ సభ్యులతో కూడా కోపంగా మాట్లాడరాదు. అప్పు ఇవ్వరాదు. అప్పు కూడా చేయరాదని వేదంలో చెప్పబడింది. అబద్దం ఆడరాదు. మాంసాహారం ముట్టరాదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వైష్ణవ దేవాలయంలో మహావిష్ణు మూర్తిని దర్శనం చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరుకోవాలి. ఎవరి ఇంటికి కూడా వెళ్ళరాదు. అవసరమైతే ఇంటిలో విష్ణు పురాణం, విష్ణు సహస్రనామాలు చదవడం చాల మంచిది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});