CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 11:44 am Posted by : coalbelt 24 News

smoking : సిగరెట్ తాగితే ఆయుస్సు ఎంత తగ్గుతుందో తెలుసా ?

smoking : పొగతాగడం ఆరోగ్యానికి హాని కరం అని సిగిరెట్ డబ్బాలపై ఉంటుంది. సిగిరెట్ తాగేవారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో పరిశోధనల్లో తేలిపోయింది. సిగరెట్ తాగేవారు వెంటనే మానుకోవాలని పలు పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి.

సిగరెట్ తాగేవారి ఆయుస్సు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని 20 నిమిషాలు సగటున తగ్గిస్తుంది. అంటే ఒక వ్యక్తి రోజుకు 20 సిగరెట్లు తాగితే, అతని జీవితంలో 7 గంటల ఆయుస్సు తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం.. ఒక సిగరెట్ పురుషుడి జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీ జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుందని తేలింది. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. టీబీ వంటి ప్రమాదకరమైన వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రతి ఏటా పది మందిలో ముగ్గురు ధూమపానం కారణంగానే చనిపోతున్నారు. సాధారణ వ్యక్తి కంటే ముందుగానే సిగరెట్ తాగే వ్యక్తి అతి తొందరగా అనారోగ్యానికి గురవుతున్నారని పరిశోధనల్లో తేలింది. సిగరెట్ తాగే 50 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల సాధారణ వ్యక్తితో సమానమవుతాడని పరిశోధనల్లో తేలింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});