CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 3:03 pm Posted by : coalbelt 24 News

Plastic : ఎథిక్ అకాడమీ స్కూల్లో “పేపర్ ఓవర్ ప్లాస్టిక్”

Plastic : మంచిర్యాల పట్టణం జన్మ భూమి నగర్ లోని ఎథిక్ అకాడమీ స్కూల్లో “పేపర్ ఓవర్ ప్లాస్టిక్” వారోత్సవాలను పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులచే తయారు చేయించిన కాగితపు సంచులను పట్టణంలోని పలు వ్యాపార సంస్థలకు పంపిణి చేశారు. ఈ సందర్బంగ డైరెక్టర్ చరణ్ రెడ్డి తల్లి దండ్రులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పెరిగితే పర్యావరణం ముప్పు తప్పదన్నారు.

ప్లాస్టిక్ వాడకంతోనే వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతున్నదన్నారు. తద్వారా ఆహార ఉత్పత్తులు కూడా కాలుష్యంతో నిండుకుంటున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గితేనే రాబోయే తరం కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు దూరం పెట్టినప్పుడే నివారణ కూడా సాధ్యం అవుతుందన్నారు. ప్లాస్టిక్ ను నిరోధించే విషయాన్నీ పాఠశాలల నుంచే ప్రారంభం కావాలన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నిత్యం మనం వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితం, వస్త్రం తో తయారు చేసిన సంచులనే ఉపయోగించాలని డైరెక్టర్ చరణ్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా “పేపర్ ఓవర్ ప్లాస్టిక్” కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్బంగా పాఠశాల యాజమాన్యాన్ని పలువురు వ్యాపార యజమానులు అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది , తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});