Ekadasi : వైకుంఠ ఏకాదశి విశిష్టత మీకు తెలుసా ?

Ekadasi : ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పవిత్రమైన మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశిని ఒక పర్వదినంలా భక్తులు విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.... మార్గశిర మాసం శ్రీ మహా విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరమైనదని వేదంలో చెప్పబడింది. ఇదే మాసంలో ధనుర్మాసంతోపాటు వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారడానికి ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని భక్తులు విశ్వసిస్తారు. ఇదే...