CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 9:03 am Posted by : coalbelt 24 News

Adhar card : ఆధార్ కార్డు తో రూ : 50 వేల లోన్

Adhar card : మీ ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ కు లింక్ ఉంటె చాలు. తక్షణమే రూ : 50 వేల ఋణం పొందడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనే కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోడానికి పీఎం స్వనిది యోజన అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.

పీఎం స్వనిది యోజన అనే పథకం చిరువ్యాపారులతో పాటు వీధి వ్యాపారులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా ఋణం పొందడానికి పీఎం స్వనిది అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదయిన ప్రభుత్వ బ్యాంకు ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి జమనాథ్ కూడా అవసరం లేదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఋణం మంజూరు కాగానే రూ: 50 వేలు మంజూరవుతాయి. మొదట రూ: 10 వేలు మంజూరవుతాయి. వీటిని ఏడాదిలోపు చెల్లించాలి. ఆ తరువాత రూ: 20 వేలు మంజూరు చేస్తారు. వీటిని కూడా ఏడాదిలోపు చెల్లించాలి. మూడో దఫా రూ : 20 వేలు మంజూరు చేస్తారు. ఈ విదంగా 50 వేల ఋణం పొందడానికి చిరు వ్యాపారులకు అవకాశం ఉంది. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});