CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 12:19 pm Posted by : coalbelt 24 News

pavan kalyan : హరి హర వీరమల్లు మొదటి గీతం వచ్చేస్తోంది. ఎప్పుడో తెలుసా ?

pavan kalyan : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరో పవన్ కళ్యాణ్. అయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. మరో వైపు నటన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు సినిమాలను పూర్తి చేయనున్నారు. అందులో హరి హర వీరమల్లు ఒకటి. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణ. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస కెమెరా చేతబట్టారు. తోట తరణి అద్భుతమైన సెట్ లను వేస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో 2025, మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అందుకు తగిన ఏర్పాట్లు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. నిధి అగర్వాల్ కథానాయిక. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘జానీ’, ‘అత్తారింటికి దారేది’ అజ్ఞాత వాసి‘, వంటి పలు సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడి అభిమానుల్లో ఉషారు నింపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హరి హర వీరమల్లు లో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి తన స్వరంతో పాట పాడుతున్నాడు. ఈ సినిమాలో ‘మాట వినాలి’ అంటూ మరోసారి తన స్వరంతో ప్రేక్షకులను మాయ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని జనవరి 6వ తేదీన ఉదయం 9:06 గంటలకు విడుదల చేయబోతున్నామని తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});