CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 8:14 am Posted by : coalbelt 24 News

Venkatesh :హీరో వెంకటేష్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో తెలుసా ?

Venkatesh : తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి డి. రామానాయుడు. ఆయన సినీ వారసుడు విక్టరీ వెంకటేష్ హీరో గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. రామానాయుడు కు ఒక అలవాటు ఉంది. సినిమా తీసున్నారు అంటే ఆ సినిమా కథకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం చదువుతారు. చదివిన తరువాతనే సినిమా తీయాలా, వద్దా అని నిర్ణయం తీసుకుంటారు.

రామానాయుడు కథ నుంచి మొదలుకొని షూటింగ్ పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా రాజీ పడరు.క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారు అనే పేరు ఉంది. చివరగా ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కూడా ఒక సినిమా తీయడానికి స్క్రిప్ట్ చదివారు. ఆ స్క్రిప్ట్ కూడా రామానాయుడికి చాలా నచ్చిందని హీరో వెంకటేష్ తో చెప్పారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ విషయాలన్నీ కూడా హీరో వెంకటేష్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో వెల్లడించారు. ఈ విషయాలతో పాటు మరో విషయాన్నీ కూడా చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు హీరో వెంకటేష్. రామానాయుడు చనిపోవడానికి కొద్దీ రోజుల ముందు ఒక స్క్రిప్ట్ చదివారు. అది చదివిన తరువాత వెంకటేష్ తో మాట్లాడుతూ ఇద్దరం కలిసి సినిమా తీద్దామని అన్నారు. కానీ ఆ కోరిక తీరక ముందే నాన్న చనిపోయాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హీరో వెంకటేష్.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});