CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 10:25 am Posted by : coalbelt 24 News

Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా .

Allu Arjun : అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్ట్ లో విచారణ ముగిసింది. అల్లు అర్జునకు బెయిల్ ఇవ్వరాదంటూ పోలీస్ శాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ అల్లు అర్జున్ తరుపున లాయర్లు వాదిస్తూ బెయిల్ ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు, అల్లు అర్జున్ కు ఏమాత్రం సంబంధం లేదంటూ లాయర్లు వాదనలు వినిపించారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ కేసు పెట్టడం కూడా సరికాదని ఆయన తరుపు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్ట్ తీర్పును జనవరి మూడో తేదికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});