CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 9:38 am Posted by : coalbelt 24 News

Thirumala : ఆ పది రోజులు తిరుమలలో దర్శనం రద్దు

Thirumala : తిరుమల, తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు ఎంత కష్టమైన అనుభవిస్తారు. ఖర్చుకు సైతం వెనుకాడరు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోప, తండాలుగా స్వామి దర్శనం కోసం తరలి వస్తారు. దర్శనం తో పాటు స్వామి లడ్డు ప్రసాదం కూడా ఇష్టపడుతారు.

గంటల తరబడి లైన్ లో ఉంది స్వామి ని దర్శనం చేసుకుంటారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నిర్వాహకులు ఇప్పుడు పది రోజుల పాటు దర్శనం రద్దు చేశారు. పది రోజులపాటు దర్శనం కు సంబంధించిన సేవలు నిలిచిపోవడంతో భక్తులు కూడా తమ యాత్రలను కూడా వాయిదా వేసుకోక తప్పలేదు. ఎందుకు పది రోజుల పాటు దర్శనం రద్దు అయ్యిందంటే ?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

2025, జనవరి లో తిరుమల ఏడుకొండల స్వామి వైకుంఠ ద్వార దర్శనం కు టీటీడీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 10 తేదీ నుంచి 19 తేదీ వరకు వైకుంట ద్వారా దర్శనం చేసుకోడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్, టికెట్ ఉన్న వారికి మాత్రమే క్యూ లో రావడానికి అనుమతిస్తారు. సాధారణ దర్శనం కోసం టికెట్, టోకెన్ తీసుకున్న వారికి ఈ పదిరోజులు వెంకటేశ్వర స్వామి దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ బోర్డు అధికారులు ప్రకటించారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});