CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 1:27 pm Posted by : coalbelt 24 News

Journey : ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలో తెలుసా?

Journey : ప్రయాణంలో కొందరికి వాంతులు అవుతుంటాయి. కొందరికి రైల్లో ప్రయాణిస్తే వాంతులు. మరికొందరికి బస్సులో ప్రయాణిస్తే వాంతులు. ఇంకొందరికి కారులో ప్రయాణిస్తే వాంతులు. ఇలా ఒక్కొక్కరికి ప్రయాణంలో వాంతులు అవుతుంటాయి. ఈ వాంతులు ప్రయాణంలో రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనేది ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.

ప్రయాణం చేయడానికి ముందు తినరాదు. కనీసం ఒక గంట ముందు తినాలి. తేలికపాటి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. నూనెలో వేయించిన పదార్తాలను అసలే తినరాదు. ప్రయాణంకు పది నిముషాలు ముందు నిమ్మ బిళ్ళలు, ఇలాచీ, లవంగం నీటిలో వేసుకుంటే వాంతులు రాకుండా ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రయాణం కు అర్ద గంట ముందు నీరు తాగాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రయాణంలో పక్కనున్నవారితో మాట్లాడుతూ ఉండాలి. లేదంటే పాటలు వినండి. ఇలా చేయడం వలన వాంతులు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెంట నిమ్మకాయ ముక్కలు తీసుకెళ్లాలి. వాటి రసం తీసుకుంటే వాంతులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});