CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 12:45 pm Posted by : coalbelt 24 News

Tablet : పారాసిటిమోల్ ట్యాబ్లెట్స్ ఏ వయసు వారికి అవసరమో తెలుసా ?

Tablet : తలనొప్పి వస్తోంది… పారాసిటిమోల్ వేసుకో… ఒంట్లో కాస్త జ్వరం ఉంది… పారాసిటిమోల్ వేసుకో…. ఒళ్ళు నొప్పులు ఉన్నవి ….అయితే పారాసిటిమోల్ వేసుకో… ఇలా వయసుతో సంబంధం లేకుండా ఎవరు పడితే వాళ్లు పారాసిటిమోల్ వేసుకుంటారు. కానీ ఏ వయసు వాళ్ళు పారాసిటిమోల్ మందు గోలి వేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఒకవేళ వయసుతో సంబంధం లేకుండా వేసుకుంటే ఏమవుతుందో తెలుసా ? ఏ వయసు వారికి ఆ గోలి అవసరమో కూడా తెలుసుకుందాం…

పెద్దలు, పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారికి పారాసిటిమాల్ గోలి ఇవ్వరాదు. పలు పరిశోధన సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన వారు ఆ మందు గోలి వాడితే అనారోగ్యం కావడం ఖాయమని పరిశోధనల్లో తేలిందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. 65 ఏళ్ల వయసు దాటిన వారు ఎప్పుడు పడితే అప్పుడు పారాసిటిమాల్ గోలి వాడితే కడుపులో మంట, మోకాళ్ళ నొప్పులు, గుండె లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు సైతం ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇంకా చెప్పాలంటే జీర్ణకోశ వ్యాధులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మూత్ర పిండాల సమస్య కూడా ఎదురవుతుంది. అదే విదంగా గుండె జబ్బులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ అయిన వారు పారాసిటిమాల్ ట్యాబ్లేట్ వేసుకోరాదు. కార్డియాలజిస్ట్ తెలిపిన ప్రకారమే ట్యాబ్లేట్ వేసుకోవాలి. లేదంటే గుండె పై ఈ ట్యాబ్లేట్ ప్రభావం చూపుతుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});