Yadagirigutta: 15 ఏళ్లుగా పాలకమండలి లేని యాదగిరి నరసన్న

Yadagirigutta: లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట.అటువంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రానికి పాలక మండలి లేదు. గత 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మలేని పరిస్థితి. కానీ నేటికీ పాలక మండలి లేకుండానే ఆలయం పనులు కొనసాగడం విశేషం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించింది. తిరుమల,తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానంకు పాలకమండలి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పాలక మండలి ఏర్పాటుకు పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చట్ట సవరణ...