Midday : మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలి

Midday : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (CITU) మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాలుగు నెలలుగా మధ్యాహ్నం భోజనం బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు పురుగులతో ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేయడం వలన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు...