CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 12:22 pm Posted by : coalbelt 24 News

tirumala : ఆరోజు తిరుమలలో బ్రేక్ దర్శనం రద్దు.

tirumala : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్‌. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం, ఆణివార ఆస్థానం, ఉగాది పురస్కరించుకొని ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతారు.

2025,జనవరి 7న ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి మొదలుకొని బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపల, ఉప దేవాలయాలు, పోటు, గోడలు, పూజా సామాగ్రి, ఆలయం పై కప్పు, ఆలయ ప్రాంగణం అంతా నీటితో శుభ్రం చేస్తారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టును కొత్త వస్త్రంతో కనబడకుండా కప్పుతారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం గంధం పొడి, గడ్డ కర్పూరం, కస్తూరి పసుపు, పచ్చాకు, నామకోపు, కుంకుమ, కిచిలిగడ్డ , శ్రీచూర్ణం, తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ప్రోక్షణం చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. ఆ తరువాత ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తరువాతనే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

2025, జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఆరోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతోపాటు జనవరి 6 న కూడా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని కోరుతో టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});