Police : నిత్య జీవితంలో ధ్యానం తప్పనిసరి
ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ Police : ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ధ్యానం ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అన్నారు. శనివారం తన కార్యాలయంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని తొలి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. యోగా అనేది మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక మరియు భౌతిక...