Police : ఇటుక బట్టి పిల్లలకు ఇంటికే విద్య… సీపీ. ఎం శ్రీనివాస్
Police : రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ఇంటికే కార్పొరేట్ విద్యను అందించడానికి సీపీ ఎం శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటుక బట్టీలల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు పదుల సంఖ్యల్లో తల్లి తండ్రులతోనే బట్టీలల్లో పనిచేస్తున్నారు. ఆ పిల్లలంతా కూడా చదువుకు దూరమై కార్మికులుగా తయారవుతారు. ఇది వారి జీవితాలను నాశనం చేస్తుందనే భావనతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నడుం బిగించారు. వారి కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీలల్లో పనిచేస్తున్న కార్మికులంతా...