Singareni : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని యాజమాన్యం…. IFTU

Singareni IFTU : సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదని IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్ ఆరోపించారు. గత కొన్నేళ్లుగా వారితో యాజమాన్యం వెట్టి చాకిరీ చేయిస్తున్నది. కానీ వారికి కనీసం ఎలాంటి హక్కులు ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. సోమవారం గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన యూనియన్ నాయకులను, కార్యకర్తలను, కాంట్రాక్టు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ...