Singareni : తెలంగాణ బొగ్గుగనులు సింగరేణికే దక్కాలి….సిపిఎం డిమాండ్
Singareni : తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికే దక్కాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలోని సింగరేణి గనులపై సీపీఎం నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. కాసిపేట 2 గని, యాప, మల్కపల్లి, కోమటి చేను, ముత్యంపల్లి, కాసిపేట ప్రాంతాల్లో కార్మికులు, రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహించారు సీపీఎం నాయకులు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులను కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. సింగరేణి గనులు కార్పొరేటర్ చేతిలో చేరితే సంస్థ భవిష్యత్తు...