Vamapaksa Party : కార్మికుల ఐక్యతను బలోపేతం చేద్దాం

Vamapaksa Party : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోందని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. మతం పేరుతో రాజకీయం చేయడంతో దేశంలో కులం ,మతం, ప్రాంతాల మద్య అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణ ను రక్షించుకొని, కార్మికుల ఐక్యతను బలోపేతం చేద్దామని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో మతోన్మాద వ్యతిరేక సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సదస్సుకు హాజరైన వామ...