Singareni : సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్ లను కేటాయించాలి
Singareni : బొగ్గు గనుల వేలం పాటను రద్దుచేసి సింగరేణి సంస్థకే బ్లాక్ లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రజలతో సంతకాల సేకరణ చేసి సింగరేణికి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీపీఎం నాయకులు మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు పరిశ్రమను కార్పొరేటర్ సంస్థలకు ఇవ్వడం కోసమే బొగ్గు బ్లాక్ ల...