singareni : సింగరేణి గనులపై సీఎం జన్మదిన వేడుకలు.

singareni : సింగరేణి బొగ్గుగనులపై ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 సింగరేణి గనిపై యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గని ఆవరణలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేక్ కోసి పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు దేవి భూమయ్య, బన్న లక్ష్మన్ దాస్ లు...