Singareni : 25న సింగరేణిలో బోనస్ చెల్లింపు

Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఈ నెల 25న దీపావళి బోనస్ ను చెల్లించడానికి సింగరేణి యజమాన్యం నిర్ణయం తీసుకొందని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ - సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్ తెలిపారు.   ప్రతి ఏటా కార్మికులకు దీపావళి బోనస్ చెల్లిస్తున్నట్టుగానే , ఈ ఏడాది కూడా చెల్లించాలని యాజమాన్యంను గుర్తింపు సంఘం హోదాలో కోరడం జరిగిందన్నారు. సంఘం విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం అంగీక రించిందన్నారు....