CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 October 2024, 8:02 am Posted by : coalbelt 24 News

thirumala darshanam : తిరుమల వెంకన్న దర్శనం వాట్సాప్ తోనే

thirumala darshanam : నిత్యజీవితంలో మొబైల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరమే. ఈ రెండింటితో కుటుంబానికి అవసరమైన పనులు చేసుకుంటున్నారు. ఒక్కరోజు నెట్ కనెక్షన్ పోయిందంటే మన భాద వర్ణనాతీతం. మొబైల్ వాట్సాప్ తో రైల్ టికెట్, బస్సు టికెట్, సినిమా టికెట్ సౌకర్యం పొందుతున్నాం. వీటన్నిటిని నిత్యజీవితంలో పొందు తున్నప్పుడు వాట్సాప్ తో తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎందుకు కాకూడదు అనే ప్రశ్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కలిగింది.

తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కు వాడుతున్న నెయ్యి కల్తీ అని తేలిపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దర్శనం టికెట్, గదుల కేటాయింపు తదితర విషయాల్లో అవినీతి జరిగినట్టుగా తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలంటూ దేవస్థానం కమిటీ కి ఏపీ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తిరుపతి వెంకన్న దర్శనం చేసుకునే భక్తులకు వాట్సాప్ సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన విదంగా సాంకేతిక పరమైన అంశాలను ఏర్పాటు చేస్తోంది టిటిడి కమిటీ. మరి కొద్ది రోజుల్లో వాట్సాప్ ద్వారా వెంకన్నను దర్శనం చేసుకునే అదృష్టం భక్తులకు అతికొద్ది రోజుల్లో కానుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});